Loading...

6, డిసెంబర్ 2017, బుధవారం

కలగా మిగిలిన నిజం - హంపిఇంతకు నాలుగైదింతలు పెద్ద ప్రాంగణం
          శ్రీశైలం వెళ్ళాలనుకున్న మా పర్యటనను కొన్ని కారణాలవల్ల బళ్ళారికి మార్చుకున్నాము. అక్కడినుండి హంపి - విజయనగరాన్ని సందర్శించే అవకాశం కలిగింది.
    హొసపేట నుంచి హంపికి మొదటిరోజు హంపిలో అడుగుపెట్టగానే ఆహాఁ....శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు నడయాడిన నేల కదా , అప్పుడూ నేనున్నానేమో మళ్ళీ వచ్చానన్న అనుభూతి కలిగింది.
      విరూపాక్షదేవాలయము , ఆ సువిశాల ప్రాంగణంలో ఉన్న కడలెకాళు గణపతి వంటి అనేక దేవాలయాలను దర్శించడంతో ఆరోజు సరిపోయింది.
విరూపాక్షదేవాలయ పుష్కరిణి
విరూపాక్ష దేవాలయ ప్రాంగణంమొదటిరోజు బస్ లో వెళ్ళాము. హొసపేట నుంచి హంపికి బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అసలు భారతీయులకన్నా ఎక్కువ విదేశీయులే కనిపిస్తూ ఉంటారు. వివరాలు కొన్ని తెలుసుకొని వస్తారు, శ్రద్ధగా అడిగి వివరాలన్నీ తెలుసుకుంటూ కనిపిస్తారు. గైడ్లు వచ్చిన వారందరికీ తెలుగు, కన్నడ, ఆంగ్లం, హిందీల్లో తమకు తెలిసినదంతా చెప్తూనే ఉంటారు.  ప్రతీ చోటా వందమందికి తక్కువ కనిపించలేదు. స్థలం పెద్దది కాబట్టి స్ప్రెడ్ అయి ఉంటారు. ప్రభుత్వపు పనులు ఎంతో బాగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా జరగవలసింది ఎంతో ఉంది. 
వేడి వేడి జొన్నరొట్టెలు, అన్నము, కూరలు, కొబ్బరిబోండాలు, ఐస్ క్రీమ్ లు, సోడాలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఐదారు వందల్లో ఆటో లో అన్నీ చూడవచ్చు. 
మేమింకో ఆసక్తి కరమైన ఏర్పాటు చేసుకున్నాము.
------------------
 రెండవరోజు తెలిసినవాళ్ళ బైక్ తీసుకున్నాము. 
కమలాపురం, విజయవిఠల దేవాలయము, శ్రీకృష్ణదేవాలయము, హజారరామమందిరము,
మహానవమిదిబ్బ, ఉద్యాన వీరభద్రాలయము, బడివి లింగ, రాయల వారి కులదైవమైన నారసింహాలయము అన్నీ తీరిగ్గా చూసుకుంటూ వెళ్ళాము. ఎప్పుడూ సిటీ ట్రాఫిక్ లో వెళ్ళే బైక్ రైడింగ్ కీ, పల్లెదారుల్లో తోటల మధ్య చక్కటి రోడ్డుపైన వెళ్ళే బైక్ రైడింగ్ కీ ఎంత తేడానో!
మా వారి fast and balanced bike driving నాకెంతో నచ్చుతుంది. ఇక ఇక్కడ అటూ ఇటూ పచ్చటి అరటి
తోటలు, జొన్న చేలు, మునగ/కొబ్బరి తోటలు, చెరకుమళ్ళ మధ్యలో బైక్ రైడింగ్! సూపర్ ఎక్సైటింగ్ ట్రిప్!
పెద్ద వాకిటి మధ్యలో చిన్న వాకిలి

రాతి కిటికీ

అందమైన హంస

శిల్పుల పనితనం


నరసింహుడు

ఎన్నితరాలకు సాక్షి గా నిలిచాయో ఈ చెట్లు!

హొసపేటలో నాటక ప్రకటన

కృష్ణా!

మేం వెళ్ళిన బైక్

తుంగభద్రా ఆనకట్ట

ఆనకట్ట వద్ద ఉద్యానవనము

ఎన్ని రంగుల కుందేళ్ళో!

రాజప్రముఖులను కలిసేందుకు నేలమాళిగలో ఏర్పాటు చేసుకున్న సమావేశమందిరం.

నేలమాళిగలోకి వెళ్ళేందుకు మెట్లు, ఒక్క కిటికీ కూడా లేదు లోపల గోడలకు నేలకు పరచిన బండలు (ఆంధ్రానుంచట) చక్కగా చల్లదనాన్నిస్తున్నాయి.

ఉత్సవాలకు హాజరైన అసంఖ్యాకులకు రాతికంచాలు

మహానవమిదిబ్బలోని పుష్కరిణి

పుష్కరిణి నింపడానికి నది నుంచి నీరు వచ్చే కాలువలు భూమికి రెండుమూడడుగుల ఎత్తులో

మహానవమిదిబ్బలో జరిగే ఉత్సవాల్లో వేదిక మీదికి వెళ్ళడానికి చక్రవర్తి కోసం మాత్రం ఏర్పాటైన వెనుక ద్వారం

           మూసి ఉన్న రాతిపలకల క్రింద భూగర్భ నీటి కాలువలనూ , అలాగే పుష్కరిణి లోకి  నీరు పారే ఏర్పాటు  కొరకు ఎత్తుమీద కట్టిన కాలువలనూ చూడవచ్చు . కమలాపురంలో పురావస్తుశాల లో త్రవ్వకాలకు ముందు ఈ ప్రాంతం ఎలా ఉండిందీ, తర్వాత ఎలా ఉన్నదీ ప్రక్క ప్రక్కనే ఫోటో లు పెట్టారు. ఇంకా ఇంకా కొత్తగా ఆ పాత వివరాలను ఎలా తెలుసుకుంటున్నదీ, అందుకు ఎంత శ్రమపడుతున్నదీ మనకు అర్థం అయ్యేలా ఉందీ శాల. విడివిడి మూర్తులను, ముక్కలు గా దొరికినవాటిని కూడా ఇందులో ఉంచి వివరాలు వ్రాసి పెట్టినారు.
       ఎన్నో దేవాలయాలలో పీఠాలు మాత్రం మిగిలి దేవీ మూర్తులు లేకపోవడం మనసును కలచివేస్తుంది.
       విజయవిఠల దేవస్థానంలోని విఠలుని ఈ దాడుల కాలంలో తీసికెళ్ళి పండరీపురం(మహారాష్ట్ర)లో ప్రతిష్ఠాపించారనీ , అక్కడ ప్రతిరోజూ ఉదయం కీర్తనల్లో కన్నడ విఠలుడని ఉటంకిస్తారనీ గైడ్ చెప్పాడు.

        దాదాపు పన్నెండడుగుల ఎత్తైన రాతి వేదిక మీద  ఆ అపురూపమైన ప్రదేశంలో ఉన్నందుకు నాట్యమాడుతుంది  మనసు.

          ఎన్నో పాశవిక దాడుల అనంతరమూ ఇప్పుడే ఇంత వైభవం కళ్ళక్కడుతుంటే ఇక అప్పుడెంత బాగుండిందో అని మనసు బాధతో కలుక్కుమంటుంది. ఆనందం ఒకరోజుంటే బాధ మరుసటిరోజే కదా ఎప్పుడూ.

           భూమిపై ఇష్టంతో దగ్గరగా వచ్చిన పెద్ద చంద్రుడిని ఆ నేల మీద చూడడం నాకు రెండింతలు ఆనందాన్నిచ్చింది.
విశిష్టమైన నృత్యభంగిమ

మత్స్యం మీద ధ్యానమా! ఇక్కడ స్థిరమైన ఆసనాల మీదే కుదరడం లేదు!

బడివి లింగ- బీదస్త్రీ స్థాపించిన లింగం ఎప్పుడూ ఒక అడుగు మేర నీటిలో ఉంటుంది.

యాళి - ఈ జంతువులో ఏడు జంతువుల వైశిష్ట్యాలు చూడవచ్చు. విజయనగర శిల్ప కళాశైలి విశిష్టత.

సుందరాకృతులు


పెద్ద రాతితొట్టె, పెద్ద గంధం రాయి

ఏనుగు

చక్రవర్తికి మాత్రమే , ఏనుగు మాత్రమే తెరవగలిగే రాతి వాకిళ్ళు (వేదికపైకి వెళ్ళే వెనుక ద్వారంవి)
ఆనంద సీమ
 

5, డిసెంబర్ 2017, మంగళవారం

?

ఏమనుకొని ఏమాశించి వస్తారో తెలీదు
జనాలు ఈ లోకంలోకి!!
ఏం సాధించలేదని వెళ్లి పోతారో అదీ తెలీట్లేదు.
సరే, తెలిస్తే మాత్రం మీరు ఆర్చే వాళ్ళా తీర్చేవాళ్ళా
అంటే ఏం చెప్పలేం కాబట్టి అడగనూ లేం.