Loading...

30, నవంబర్ 2017, గురువారం

ఆవోగే జబ్ తుమ్.....

"జబ్ వి మెట్" చిత్రంలోని " ఆవోగే జబ్ తుమ్ ఓ సాజ్ నా " అనే మంచి పాటకి అదే రాగంలో భావానువాదం చేశాను.
చిత్తగించండి. చెలి, చెలికాడు సమక్షంలో లేదా ఆ చుట్టుపక్కల ఉన్నారన్నప్పుడు ఆ ఉద్వేగం ఎలా ఉంటుందో  చక్కగా చెప్పబడిన పాట అనిపించింది. దాదాపు అదే  రాగంలో వచ్చేలా వ్రాసుకున్నాను.

నీ రాకతో......నే..మధుమాసమే
ఓ చెలీ....నా తోటలోనే...
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది... (నీ రాకతో)

కవ్వించే కాటుక కనులేలే
దోచేసే నా మది నీవేళే
రాసేనే లేఖలు వేవేలు
చేసేనే బాసలు ఏవేవో
కలిసేనులే......ఈ వనినే.....ఆమని....
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది...
(నీ రాకతో)

జాబిల్లి తోడుగ ఈ రేయి
నీవల్లే నా మది మురిసేనే
సాగేనే నీ కనుసన్నల్లో
చుక్కల్లా మెరిసేటి చూపుల్లో
కలలెన్నో మరి.....చిగురించేనిలా...
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది...
(నీ రాకతో)

(ఇది ఏడేళ్ళ క్రిందటి పోస్ట్ . ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేయాలనిపించింది.)

28, నవంబర్ 2017, మంగళవారం

కల్మది

పలుతెఱగులివి జగములనుఁ
లిగెడి పరిచయములెల్ల, తమెద్దియనన్
పలుతెఱగులవి మనములిట
తిలకించగ నొక్కమారు తెల్లమగు సుమా. 


 తీరగు రీతిని మాటలఁ
గూరిచి యొప్పుగఁ బలుకగఁ గూరిమి కలుగున్,
మారక యెప్పుడు నిలువగ
నోరిమి మదిలో వహించి యుండగ వలెనోయ్.

శిసమమిది నా మదిగది
శిసుమమాలల బిరాన సిద్ధపరచుమా, 
చెలియా, తెలియక నొకమది
వరపడగా నెటులనొ తమైతి గదా!

---లక్ష్మీదేవి.

27, నవంబర్ 2017, సోమవారం

నిఘంటువు

తెలుగు నిఘంటువు అనే పేరుతో రంగులతో, హంగులతో అలరారుతూ తెలుగు భాషానురక్తులకు,
1. తెలుగు పదములు, వ్యుత్పత్తి, పద్యములలో వాటి ప్రయోగాలు తెలుసుకోగోరే వారికి,
2 .తెలుగుని ఇతర భాషలోని పదాలతో పోల్చి చూడాలనుకునేవారికి,
3.ఆ యా పదాల్ని పద్యంలోనూ , వచనం లోనూ ఎలా ప్రయోగించారో నేర్చుకోడానికి,
4. పర్యాయ పదాలకోసం వెతికేవారికి,
5. ఒక్కో పద్యానికీ ఛందోరూపం తెలుసుకోవాలని కొన్ని ఉదాహరణలు కావాలనుకునేవారికి,
6. అసలు మన తరానికి నేర్పింపఁబడని బండి ర (ఱ) అంటే శకటరేఫనీ, అరసున్నా నీ పద్యాలలో ఎలా వాడేవారో తెలుసుకోవటానికీ,
7. యాదృచ్ఛికపదంగా ఏదో ఒక పదాన్ని గురించి తెలుసుకోడానికి,
8. ఉపసర్గ, ప్రత్యయాల ఆధారంగా పదాలను వెతకడానికి అనువుగా ఏర్పాటు చేయబడ్డ సదుపాయాన్ని వినియోగించుకోడానికి, (కొత్తగా ఏర్పరచబడింది.)

ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగ పడే ఈ మన నిఘంటువు ని చూస్తారా?
telugu nighantuvu,తెలుగు నిఘంటువు


Telugu nighantuvu,telugu dictionary,online telugu nighantuvu,online telugu dictionary, Surya rayandhra telugu nighantuvu.తెలుగు-తెలుగు నిఘంటువు, http://telugunighantuvu.org/

26, నవంబర్ 2017, ఆదివారం

అవీ ఇవీ

               ఆరోగ్యవంతమైన భయము, సరి/కాదు అన్న వివేచన, మనచుట్టూ ఉండే వారి పట్ల బాధ్యత గలిగిన ప్రవర్తన ఇవన్నీ ఉండవలసినవే. మంచి గుణాలే. ప్రతి దశలోనూ ఆశించవలసింది ఏమిటి, వదులుకోవలసింది ఏమిటి అని నిర్ణయించగల వివేకం పెంపొందించుకోగలగడం మంచిదే.  అనుకోకుండా ఏ విధంగా స్పందించినా, కొంచెం సమయం తీసుకొని అయినా ఆలోచించి అడుగేయడమే ఏ పరిస్థితిలోనైనా మంచిది.
 ----
           అభిప్రాయాలు/ అభిరుచులు/ ఆలోచనలు కలిసిన స్నేహితులు దొరకడం, వారితో తెలిసిన విషయాలు, నచ్చిన అంశాల గురించి మాట్లాడగలగడం ఆనందకరం.
           మన చిన్న పాటి ప్రతిభనైనా సరే గమనించి ఆదరించే స్నేహితులు ఉన్నప్పుడు మనసుకు కలిగే సంతోషం చాలా గొప్పది. అలాంటి స్నేహితులు ఉన్న వారికి జేజేలు.
-----
         చిన్న మేనల్లుడి (ఏడో తరగతి)తో బంతాట ఆడడం ఎంతో ఉల్లాసంగా అనిపించింది. అసలు ఉల్లాసమైన మనసు ఉన్నప్పుడే అంత ఇష్టంగానూ ఆడానేమో. ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళినట్టు అనిపించింది. సంతోషం సగం బలం కదా. :)
 ------
అభిరుచుల మీద శ్రద్ధ పెట్టడం ఇచ్చే ఆనందం చాలా గొప్పది.