Loading...

26, నవంబర్ 2015, గురువారం

ఈ నల్లని రాలలో అనే ప్రసిద్ధమైన అమరశిల్పి జక్కన చిత్రగీతపు రాగంలో....

ఈ నల్లని రాలలో అనే ప్రసిద్ధమైన అమరశిల్పి జక్కన చిత్రగీతపు రాగంలో....చందమామను గురించి..

ఈ చల్లని గాలిలో ....ఆ అల్లరి మామతో
నే మెల్లగ నడువగా....నా ఉల్లము పొంగునే.....!!
ఈ చల్లని గాలిలో.....!



దవ్వునున్న వాడయ్యును
నవ్వులెన్నొ కురిపించును.
పవ్వళించు వేళలోన
కవ్వించుచు కనిపించును.
ఈ చల్లని గాలిలో....!

పైన ఉండి మురిపించును
లోని గుండె కదిలించును,
తేనె లొలుకు వెన్నెలతో
ఇతడే, నా వాడనిపించును!
ఇతడేనా, వాడనిపించును!
ఈ చల్లని గాలిలో....!