Loading...

4, మార్చి 2013, సోమవారం

ఖుజురహో నృత్యోత్సవం


మధ్యప్రదేశ్ లోని ఖుజురహో పేరు అందరూ వినే ఉంటారు. అక్కడ ఈ మధ్య భారతీయ నృత్యోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముఖ్యంగా కథక్, ఒడిస్సీ, భరతనాట్యం ప్రదర్శనలు జరిగాయి.  మన కూచిపూడి, కథాకళి, మణిపురి నృత్యాలకు కూడా చోటు దొరికింది. ఏ ప్రాతిపదిక మీద ఏ నాట్యానికి ఇంతసేపు అని కేటాయిస్తారో అవన్నీ నాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరమూ జరిగే ఈ కార్యక్రమము గుడి ఆవరణలో శిల్పసౌందర్యము నేపథ్యంగా ప్రతిరోజూ సాయంసంధ్యారుణ కాంతులను మరింత కాంతివంతం చేసే  ప్రత్యేక దీపాల ఏర్పాట్లలో వర్ణమయంగా అద్భుతంగా , అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరము ఇరవై, ఇరవై ఆరు తేదీల కాలంలో వారం పాటు సాగింది. ప్రవేశం ఉచితం. మాఘపౌర్ణమి వచ్చినప్పుడే ఇది జరుగుతుందేమో మరి.
ఈ కార్యక్రమాలు నేరుగా చూడలేకపోయినా, దూరదర్శన్ "భారతి"లో ప్రత్యక్షప్రసారం చేస్తుండగా కొన్ని భాగాలు చూసి తరించినాను.
వీటి గురించి మరిన్ని వివరాలు కావాలంటే వీడియోలు చూడాలంటే

ఖుజురహో నృత్యోత్సవం

ఇక్కడ చూడవచ్చు.