Loading...

6, ఫిబ్రవరి 2013, బుధవారం

శ్వేతజలపాతం

వెన్నెల టెంకాయ చెట్టు ఆకుల మధ్యలోంచి
అమాంతంగా దూకి
నెమ్మదిగా........
లోకమంతా ప్రవహిస్తున్నది...

కొండల పైకి సెలయేరు దూకి రాళ్ళమీదుగా వాగై
సాగినట్టు.......

చిన్ని బాబు కళ్ళల్లో మెఱుపులుగా దూకి పెదవుల మీద నవ్వుగా
మారి ఆనందం వెల్లువైనట్టు.......

చుక్కలుగా కలిసి గీతలుగా సాగి కలుస్తూ విడిపోతూ
రంగవల్లులుగా తెలుగింటిని అందగించినట్టు.........

భావుకహృదయంలో భావమై తోచి అక్షరమై, ధ్వనియై
రసికుల మనసులపై తేలియాడినట్లు.........