Loading...

24, మే 2012, గురువారం

ఆనందంఅన్నీ మన మంచికే అంటుంటారు, కానీ ఒక్కోసారి కోపం ఆగదు, ఎందుకిలా జరగాలి అని ఆందోళన పడిపోతుంటాం. అవతలి వాళ్ళ మీద విరుచుకు పడిపోతుంటాము.
            అంతెందుకు? పవర్ కట్ అయినపుడల్లా ఎంత కోపంవస్తుందో, ఈ విద్యుత్తే లేనప్పుడు మనుషులు లేరా ఏం? అసలు ఇప్పుడు కూడా నగరాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువ సేపు ఈ కోతలుంటాయి కదా, వాళ్ళెలా ఉంటారు? అన్నీ తెలిసినా కూడా, ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కోపంవస్తుంది.
             అసలు నిరంతరాయంగా విద్యుత్సరఫరా ఉంటే బాగుంటుంది అనీ అనిపిస్తుంది. కొన్ని రోజులు అలవాటయితే కోపం తగ్గుతుంది. రాత్రి పూట విద్యుత్కోత సమయంలో మిద్దెమీద నిద్దుర పోవటం లో ఉన్న ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఎంత త్వరగా నిద్రపట్టేస్తుందో, సూర్యోదయం అయ్యీ కాక ముందే అలారమ్/ ఫోన్ లేకుండానే ఎలా మెలకువ వస్తుందో తెలుస్తుంది.
                   నదిలో స్నానం చేస్తే సబ్బులు, షాంపూలు గోల లేకుండా చక్కగా నెచ్చెలులతో కలిసి గంటలు గంటలు నీళ్ళలో జలకాలాడుతుంటే అది ఎవరికి వారికే అర్థమయ్యే ఒక ఆనందం. అలా స్నానం చేశాక ఎంత ఆకలి వేస్తుందో అది కొత్తగా ఉంటుంది.   రాత్రి ఎంత ప్రశాంతంగా గాఢనిద్ర పడుతుందో అదంతా మనం ప్రకృతి నుంచి ఎంత దూరం వచ్చేశామో తెలుపుతుంది. ఈ మధ్యలో ఒక పల్లెకు , ఒక నది ఉన్న క్షేత్రానికి ఫంక్షన్ లకు వెళ్ళి కొన్ని రోజులు ఉండటం మూలంగా మనసులో మెదిలిన భావాలు.