Loading...

20, ఫిబ్రవరి 2012, సోమవారం

గౌరీ శివుల పెండ్లి

సింగారమొప్పగా చిఱునవ్వు మెరయగ 
శ్రీగౌరి సిగ్గుల చిలికె గనుము. 

ప్రియమార గౌరిని పెండ్లాడు నీశుండు
పిలిచెను రారండి ప్రీతి తోడ.


చుక్కలు పువ్వులై చూడముచ్చటగను
జలజలా రాలెను జంట పైన


బుగ్గన నల్లటి బొట్టుగా నమరెను
పున్నమి తెలుపులు పోగ చంద్రు


డాదిదేవునికిట పెండ్లి యంగరంగ 
వైభవమ్ముతోడ జరిగె, వాయనమ్ము
లంది తృప్తిగా భుజియించిరందరిపుడు.
సర్వజగతికి రక్షణ శాశ్వతముగ.
శుభమ్||  


------లక్ష్మీదేవి