Loading...

11, ఏప్రిల్ 2012, బుధవారం

............కదూ!!

వెన్నెల కిరణాల్లో వెచ్చదనాలూ...
చల్లని గాలుల్లో అల్లరి వెల్లువలూ....
మల్లెల కాలంలో కల్లల నోములూ....
తెలిసొచ్చాయంటే....
వలపుల దేవునికి ,
పులకింతల నైవేద్యాలు .. 
పెట్టే తరుణం వచ్చిందనే.......
............కదూ!!

పరవశమైన  ప్రకృతి కన్యను 
దిక్కుల దీర్ఘ బాహువుల్లో 
పురుష వరుడు చుట్టేసి నపుడు
ఊపిరుల వెచ్చదనాలు...
చూపుల చల్లదనాలూ .....
సెలయేటి తానాలు మరిపిస్తుంటే ...
సమాగమ తరుణాలకు ,
అరుణోదయమైనట్టే.......
........కదూ!! 

4 వ్యాఖ్యలు:

  1. పులకింతల నైవేద్యాలు ఈ ఉపమానం బాగుందండీ!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలు రసజ్ఞ గారు,
    ఎంతైనా రసజ్ఞులు రసజ్ఞులే!!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. వలపుల దేవునికి...
    పులకింతల నైవేద్యం...
    కదూ...

    చాలా క్లుప్తంగా...
    ఉంది చక్కంగా...
    కదూ...

    మేడం గారు
    చాలా బాగుంది...

    ప్రత్యుత్తరంతొలగించు
  4. ఔనండీ, రెండేళ్ళ తరువాత ఇప్పుడు చదువుతుంటే నాకే మురిపెంగా అనిపిస్తుంది.
    ధన్యవాదాలు మీకు.

    ప్రత్యుత్తరంతొలగించు