Loading...

22, సెప్టెంబర్ 2011, గురువారం

ముందడుగు

కలగానే మిగులుతుందేమో
అలుపెరుగని పోరాటం
అలలా నిరాశ ఉవ్వెత్తున ఎగసి భయపెడుతుంటే
పులకింతల పున్నములెప్పుడో
మలుపులు తిరిగిన బ్రతుకు నడక
అలసట తీరేదెన్నడో
శిలగా మారిన హృదయాలు
కదిలేదెప్పుడో
చలనమంతా ముందడుగు వేసేందుకే
కదిలేదెప్పుడో!

కలవరమెంతున్నా ,
కలం ఆగినా కాలం ఆగదు.
            ----లక్ష్మీదేవి